Mangalaharathi 2 - Sri Lalitha
2. శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయా గిరామయా సర్వమంగళా
- జగముల చిరునగవుల పరిపాలించే జననీ
అనయము మము కనికరముగ కాపాడే జననీ
మనసే నీవసమై స్మరణే జీవనమై మాయని వరమీయవే మంగళదాయని ఈశ్వరి శ్రీ
- అందరికన్నా చక్కని తల్లికి సూర్య హారతి
అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తలుకుల కలలా జ్యోతుల కర్పురహరతి
సకలనిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి శ్రీ
హాయ్!! ఈ పాట కావలసిన వాళ్ళు రాగ డాట్ కాంలో సాంప్రదాయ మంగళ హారతులు వోల్యుం లో చూడగలరు !!
Comments